Devi Sri Prasad
Uppenantha
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ... నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
కనులలోకొస్తావు కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావు
మంచులా ఉంటావు మంటపెడుతుంటావు
వెంట పడి నా మనసు మసిచేస్తావు
తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి
గుచ్చుకోకు ముల్లులా మరీ గుండెల్లో సరాసరి
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
I love you నా ఊపిరి ఆగిపోయినా
I love you నా ప్రాణం పోయినా
ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో