Sid Sriram
Samajavaragamana
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన... నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున
సామజవరగమన... నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
మల్లెల మాసమా... మంజుల హాసమా...
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా...
విరిసిన పించెమా... విరుల ప్రపంచమా...
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా...
అరె, నా గాలే తగిలినా... నా నీడే తరిమినా...
ఉలకవా... పలకవా... భామా...
ఎంతో బ్రతిమాలినా... ఇంతేనా అంగనా...
మదిని మీటు మధురమైన మనవిని వినుమా...